పుట్టింటి నుంచి రానని మొండికేసిన భార్య.. ఆగ్రహంచిన పోలీస్ భర్త తుపాకీ పట్టుకెళ్లి ఎంత పని చేశాడంటే..

ABN , First Publish Date - 2022-06-03T18:30:04+05:30 IST

వారికి ఏడాది క్రితం వివాహమైంది.. పెళ్లయ్యాక కొన్ని రోజుల పాటు భార్యాభర్తలు బాగానే ఉన్నారు..

పుట్టింటి నుంచి రానని మొండికేసిన భార్య.. ఆగ్రహంచిన పోలీస్ భర్త తుపాకీ పట్టుకెళ్లి ఎంత పని చేశాడంటే..

వారికి ఏడాది క్రితం వివాహమైంది.. పెళ్లయ్యాక కొన్ని రోజుల పాటు భార్యాభర్తలు బాగానే ఉన్నారు.. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.. క్రమంగా గొడవలు పెరిగాయి.. పెద్దలు నచ్చజెప్పారు.. అయినా వారి మధ్య గొడవలు తగ్గలేదు.. దీంతో భార్య తన పుట్టింటికి వెళ్లిపోయిది.. రోజులు గడుస్తున్నా తిరిగి భర్త దగ్గరకు వెళ్లలేదు.. దీంతో ఆ భర్త తన భార్యను కాపురానికి పంపించాలని అత్తామామలకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు.. అయినా ఆమె రాకపోవడంతో బుధవారం నేరుగా వారి ఇంటికి వెళ్లి కాల్పులు జరిపాడు. 


ఇది కూడా చదవండి..

నా చావు వార్తను ఈ నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పండంటూ లేఖలో రాసిన వ్యక్తి.. ఆ నెంబర్‌ ఎవరిదో, అతడి కథేంటో పోలీసులకు తెలిసి..


బీహార్‌లోని ముంగేర్‌ జిల్లా కాసిం బజార్‌కు చెందిన సోనూ కుమార్‌కు, అంచల్‌తో గత ఏడాది జులై 16న వివాహం జరిగింది. సోనూ బీహార్ పోలీస్ శాఖలో పనిచేస్తున్నాడు. పెళ్లయ్యాక కొన్ని రోజుల పాటు సోనూ, అంచల్ బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. పెద్దలు నచ్చ చెప్పినా వారు రాజీ పడలేదు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం అంచల్ తన పుట్టింటికి వెళ్లిపోయిది. నెలలు గడుస్తున్నా తిరిగి భర్త దగ్గరకు వెళ్లలేదు. అంచల్‌ను కాపురానికి పంపించాలని సోనూ అత్తామామలకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. అయినా అంచల్ రాకపోవడంతో సోనూ మంగళవారం నేరుగా వారి ఇంటికి వెళ్లిపోయాడు. 


అంచల్‌ను కాపురానికి పంపాలని అత్తామామలకు చెప్పాడు. భర్త వద్దకు వెళ్లే ప్రసక్తే లేదని అంచల్ తేల్చిచెప్పింది. దీంతో సోనూ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. బుధవారం ఉదయం రివాల్వర్‌ పట్టుకుని అత్తింటికి వెళ్లాడు. మళ్లీ వారితో గొడవకు దిగాడు. ఆ తర్వాత తుపాకీతో మామ గిర్‌ధర్, బావమరిది కృష్ణకుమార్‌పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో సోనూ మామ గిర్‌ధర్ అక్కడికక్కడే మరణించాడు. కృష్ణకుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన తర్వాత సోనూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-06-03T18:30:04+05:30 IST