Abn logo
Mar 6 2021 @ 02:25AM

మహిళా సంరక్షణ పై లఘు చిత్రాలకు పోలీసుల ఆహ్వానం

తిరుపతి(నేరవిభాగం), మార్చి 5: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో లఘు చిత్రాల పోటీ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.  ‘ మహిళా సంరక్షణ’ అనే అంశంపై 1 నుంచి 3 నిమిషాలలోపు నిడివితో లఘు చిత్రం ఉండాలని సూచించారు. 7వ తేదీ సాయంత్రంలోపు పోటీదారులు లఘుచిత్రాలను తమకు అందజేయాలని పేర్కొన్నారు. స్థానిక ప్రకాశం రోడ్డులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కార్యాలయ విభాగం, అదనపు ఎస్పీ సుప్రజ కార్యాలయ విభాగంలోగాని, దిశ మహిళ పోలీసు స్టేషన్‌ డీఎస్పీ కార్యాలయంలోగాని, పోలీసు వాట్సప్‌, ఫేస్‌బుక్‌ ద్వారాగాని పోటీదారులు లఘుచిత్రాలను పంపించాలని సూచించారు. ఎంపికైన ఉత్తమ లఘుచిత్రాలకు పోలీసు అధికారులచే ప్రశంసా పత్రాలను అందజేస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement