సీఐ ఉదారత.. డయాలసిస్ పేషంట్‌కు సాయం

ABN , First Publish Date - 2020-04-10T23:34:50+05:30 IST

లాక్‌డౌన్ బందోబస్తులో బిజీగా ఉంటున్న పోలీసులు.. అవసరమైన సందర్భాల్లో తమ ఔదార్యాన్ని చాటుతూ పలువురి అభినందనలు అందుకుంటున్నారు.

సీఐ ఉదారత.. డయాలసిస్ పేషంట్‌కు సాయం

హైదరాబాద్: లాక్‌డౌన్ బందోబస్తులో బిజీగా ఉంటున్న పోలీసులు.. అవసరమైన సందర్భాల్లో తమ ఔదార్యాన్ని చాటుతూ పలువురి అభినందనలు అందుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..  శుక్రవారం మధ్యాహ్నం కూకట్‌పల్లి ‘వై’ జంక్షన్ దగ్గర ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఈ సందర్భంగా రవాణా సౌకర్యం లేక ఓ వృద్ధుడు ఇబ్బంది పడుతున్న దృశ్యం అక్కడ తనిఖీల్లో ఉన్న కూకట్‌పల్లి సీఐ లక్ష్మీనారాయణ రెడ్డి కంట పడింది. వెంటనే వాకబు చేయగా.. వృద్ధుడు డయాలిసిస్ పేషెంట్ అని తెలిసింది. దీంతో తన వాహనంలో ఆ వృద్ధుడిని ఇంటికి చేర్చారు. సీఐ ఉదారతకు మురిసిపోయిన ఆ పెద్దాయన.. నూరేళ్లు చల్లగా ఉండాలంటూ ఆశీర్వదించారు. 

Updated Date - 2020-04-10T23:34:50+05:30 IST