రేపటి నుంచి పోలీస్‌ ఫ్లాగ్‌ డే

ABN , First Publish Date - 2021-10-20T04:09:53+05:30 IST

గురువారం నుంచి ఈ నెల 31వరకు పోలీస్‌ ఫ్లాగ్‌డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌. వారియర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

రేపటి నుంచి పోలీస్‌ ఫ్లాగ్‌ డే

 సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌

ఖమ్మంక్రైం, అక్టోబరు 19: గురువారం నుంచి ఈ నెల 31వరకు పోలీస్‌ ఫ్లాగ్‌డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌. వారియర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 21న జిల్లా పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ పరెడ్‌గ్రౌండ్‌ స్మారక స్థూపం వద్ద ఫ్లాగ్‌ డే పరెడ్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 22 నుంచి 24వరకు గాయపడిన, మృతి చెందిన పోలీస్‌ కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శి స్తామన్నారు 23న జిల్లాలోని పోలీస్‌ స్టేషన్ల, సబ్‌ డివిజన్‌ పరిధిలో రక్తదాన శిబిరాలు, 25న సైకిల్‌ర్యాలీ, 26న ఓపెన్‌హౌస్‌, 27, 28 తేదిల్లో పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. 27న హోంగార్డు అధికారులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మూడు నిమిషాల నిడివితో పోలీస్‌ సేవలు త్యాగాలు ప్రతిబింబించేలా తాజాగా రూపొం దించి చిత్రాలు 30 తేదిలోగా  రాష్ట్ర పోలీస్‌ వెబ్‌సైట్‌, జిల్లా పోలీస్‌ వెబ్‌ సైట్‌ల్లో  సమర్పించాలని సూచించారు. ఈనెల28న జాతి నిర్మాణంలో పోలీసుల పాత్ర అనే అంశం పై విద్యార్థులకు ఆన్‌లైన్‌ లో తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్ధు బాషల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తామని సీపీ చెప్పారు. ఈపోటీలలో పాల్గొనే విద్యార్థులు ఆన్‌లైన్‌లో పాల్గొనాలని ప్రకటన లో సూచించారు. 


Updated Date - 2021-10-20T04:09:53+05:30 IST