దుకాణాలు లూటీ.. ప్రజలపై పోలీసుల కాల్పులు

ABN , First Publish Date - 2020-08-11T08:20:02+05:30 IST

దుకాణాలను ప్రజలు లూటీ చేశారు. వారిని నిలువరించడానికి పోలీసులు కాల్పులకు దిగాల్సి వచ్చింది. అమెరికాలోని షికాగోలో మంగళవారం తెల్లవారుజాము న ఈ ఘటన జరిగింది...

దుకాణాలు లూటీ.. ప్రజలపై పోలీసుల కాల్పులు

షికాగో, ఆగస్టు 10: దుకాణాలను ప్రజలు లూటీ చేశారు. వారిని నిలువరించడానికి పోలీసులు కాల్పులకు దిగాల్సి వచ్చింది. అమెరికాలోని షికాగోలో మంగళవారం తెల్లవారుజాము న ఈ ఘటన జరిగింది. వందలాది మంది ప్రజలు ఏంజిల్‌వుడ్‌ తదితర ప్రాంతాల్లోని వివిధ దుకాణాల వద్దకు ఒక్కసారిగా వెళ్లారు. అద్దాలను, కిటికీలను పగులగొట్టి సరుకులను ఎత్తుకెళ్లారు. వారిని నిలువరించడానికి పోలీసులు గంటపాటు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో గాయపడిన వారందరినీ ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రజల అశాంతికి కారణాలేమిటో తెలియరాలేదని పోలీసులు చెప్పారు. అయితే, ఆ ప్రాంతంలో పోలీసులపై వ్యతిరేకత ఉందని చెబుతున్నారు. ఈ ఘటనలకు ముందు మధ్యాహ్నం వేళలో ఒక వ్యక్తి మరొకరిని తుపాకీతో బెదిరిస్తుండగా పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. 


Updated Date - 2020-08-11T08:20:02+05:30 IST