'మంగళూరు ముస్లిం' ఫేస్‌బుక్ పేజీ అడ్మిన్లపై ఎఫ్ఐఆర్

ABN , First Publish Date - 2022-02-23T21:58:07+05:30 IST

బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష ఆదివారం దారుణ హత్యకు గురైన నేపథ్యంలో విద్వేషం, హింసను ప్రోత్సహించారన్న...

'మంగళూరు ముస్లిం' ఫేస్‌బుక్ పేజీ అడ్మిన్లపై ఎఫ్ఐఆర్

బెంగళూరు: బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష ఆదివారం దారుణ హత్యకు గురైన నేపథ్యంలో విద్వేషం, హింసను ప్రోత్సహించారన్న కారణంగా 'మంగళూరు ముస్లిమ్స్' ఫేస్‌బుక్ పేజీ అడ్మిన్లపై మంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫేస్‌బుక్ పేజీలో హర్ష హత్యను సమర్ధిస్తూ పోస్ట్‌లు పెట్టినట్టు పోలీస్ కమిషనర్ సోషల్ మీడియా సెల్ సభ్యులు గుర్తించారు. 2015లో మహమ్మద్ ప్రవర్తపై హర్ష అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆ పోస్టింగ్ పేర్కొంది. దీంతో పేజ్ ఎడ్మిన్‌పై మంగళూరులోని సైబర్, ఎకనామిక్ అండ్ నార్కోటిక్స్ అఫెన్సెస్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.


ఫేస్‌బుక్ పేజీలో హర్షను 'వీధి కుక్క'తో పోల్చారని, మహమ్మద్ ప్రవక్తను అవమానించిన వారెవరికైనా ఇలాంటి గతే పడుతుందని హెచ్చరించినట్టు కూడా ఉందని తెలుస్తున్నది. కాగా, హిందూ సంస్థలు, హిందూ నేతలు సామాజిక అంశాంతిని రెచ్చగొడుతున్నారంటూ మంగళూరు ముస్లిమ్స్ పేజ్‌ వ్యాఖ్యలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. మహమ్మద్ షఫిఖ్ అనే వ్యక్తి పేరును ఫేస్‌బుక్ పేజీ అడ్మిన్‌గా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నట్టు కూడా తెలుస్తోంది. హర్ష హత్య అనంతరం సోషల్ మీడియా పోస్టులపై నిరంతరం నిఘా ఉంచామని మంగళూరు పోలీసులు తెలిపారు. సోమవారం హర్ష అంత్యక్రియుల ఊరేగింపులో హింస చెలరేగడంతో గాయపడిన వారిలో ఒక ఫోటో జర్నలిస్టు, ఒక మహిళా పోలీసు ఉన్నారు.

Updated Date - 2022-02-23T21:58:07+05:30 IST