జాగిలం జోష్‌

ABN , First Publish Date - 2021-10-28T05:06:56+05:30 IST

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఓపెన్‌ హౌస్‌లో రెండో రోజు బుధవారం నిర్వహించిన పోలీసు జాగిలాల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నగరంలోని పోలీసు కవాతు మైదానంలో జరిగిన ఈ ప్రదర్శనకు వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎస్పీ సీహెచ్‌ విజయరావు కుటుంబ సమేతంగా జాగిలాల విన్యాసాలను వీక్షించారు.

జాగిలం జోష్‌
ఈజీగా దాటేస్తా : రింగ్‌లో నుంచి దూకుతున్న జాగిలం

ఆకట్టుకున్న పోలీస్‌ డాగ్స్‌ విన్యాసాలు

నెల్లూరు(క్రైం), అక్టోబరు 27: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఓపెన్‌ హౌస్‌లో రెండో రోజు బుధవారం నిర్వహించిన పోలీసు జాగిలాల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నగరంలోని పోలీసు కవాతు మైదానంలో జరిగిన ఈ ప్రదర్శనకు వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎస్పీ సీహెచ్‌ విజయరావు కుటుంబ సమేతంగా జాగిలాల విన్యాసాలను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసాంఘిక శక్తుల అణచివేతలో, శాంతి భద్రతల పరిరక్షణలో, నేర నియంత్రణలో, దర్యాప్తులో పోలీసులు తీసుకునే చర్యల గురించి వివరించేందుకే ఓపెన్‌ హౌస్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి కార్యక్రమాల వలన యువత పోలీస్‌ శాఖ, ఇతర భారత బలగాలలో సేవలందించడానికి ముందుకు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.



Updated Date - 2021-10-28T05:06:56+05:30 IST