ఆ అధికారం పోలీసులకు లేదు: హైకోర్టు సంచలన తీర్పు

ABN , First Publish Date - 2021-11-06T03:57:16+05:30 IST

ఆ అధికారం పోలీసులకు లేదు: హైకోర్టు సంచలన తీర్పు

ఆ అధికారం పోలీసులకు లేదు: హైకోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ట్రాఫిక్ పోలీసులకు చుక్కెదురైంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై హైకోర్టులో 40 రిట్ పిటిషన్లు దాఖలు అయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో డ్రైవర్ తాగి పట్టుబడితే వాహనాన్ని వాహనదారుని సన్నిహితులకు సమాచారం ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. కొన్ని తప్పనిసరి సందర్భాల్లో వాహనాన్ని పోలీస్ కస్టడీకి తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. పోలీస్ కస్టడీలోకి తీసుకున్న వాహనాన్ని  వాహనం ఆర్సీ చూపిస్తే అట్టి వాహనాన్ని రీలీజ్ చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంతే కానీ డైరెక్టర్‌గా మోటార్ వెకిల్ యాక్ట్ ప్రకారం వాహనాన్ని సీజ్ చేసే అధికారం ఎవ్వరికీ లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై దాఖలైన 40 పిటిషన్‌ల విచారణను హైకోర్టు ముగించింది.

Updated Date - 2021-11-06T03:57:16+05:30 IST