Texas School కాల్పుల ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..!

ABN , First Publish Date - 2022-06-21T03:11:12+05:30 IST

టెక్సాస్ స్కూల్(Texas School) కాల్పుల ఘటనలో తాజాగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Texas School కాల్పుల ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..!

ఎన్నారై డెస్క్: టెక్సాస్ స్కూల్(Texas School) కాల్పుల ఘటనలో తాజాగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారులపై కాల్పులు జరుపుతున్న నిందితుడు రామోస్‌ను మట్టుపెట్టేందుకు పోలీసులు ఎందుకు ఆలస్యం చేశారన్న దానిపై ఓ పోలీస్ అధికారి గతంలో ఇచ్చిన వివరణ సరికాకపోవచ్చంటూ స్థానిక మీడియా సంస్థ తాజా పేర్కొంది. నిందితుడు క్లాస్ రూంలోపలి నుంచి లాక్ చేసుకున్నాడని ఇప్పటివరకూ అంతా భావిస్తూ వచ్చారు. అయితే.. తలుపుల తెరిచేందుకు తాము తాళాల కోసం చాలా సేపు వెతకాల్సి వచ్చిందని అప్పట్లో ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న కమేండర్ మీడియాకు చెప్పారు. అయితే.. వారు తరగతి గదుల తలుపులు తెరిచేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని తాజాగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. 


నిందితుడు తలుపులను లాక్ చేయలేకపోయి ఉంటాడంటూ విశ్వసనీయ వర్గాలు చెప్పారనేది మీడియా కథనం. ఆ గదులకు ఉన్న ఆటోమేటిక్ లాక్స్ పనిచేయని కారణంగా ఈ పరిస్థితి తలెత్తి ఉండొచ్చని సమాచారం. ఇక కాల్పులు జరుగుతున్న సమయంలో తలుపులు తెరిచే ఉన్నాయా లేదా అన్న అంశాన్ని ప్రస్తుతం దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. 


అమెరికాలో మే 25న ఓ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకున్న కాల్పుల ఘటన యావత్ దేశాన్నీ శోకసంద్రంలో ముంచేసిన విషయం తెలిసిందే. అసాల్ట్ రైఫిల్‌తో 18 ఏళ్ల రామోస్ ఆ పాఠశాలలోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో తరగతి గదిలోని 19 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లు అక్కడిక్కడే మరణించారు. ఉవాల్డే పట్టణంలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. అయితే.. నిందితుడు కాల్పులకు తెగబడుతున్నా పోలీసులు మాత్రం తరగతిలోకి ప్రవేశించేందుకు గంటకు పైగా వేచి చూడటం పలు విమర్శలకు తావిస్తోంది. అసలు ఆ సమయంలో ఏం జరిగిందనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. 




Updated Date - 2022-06-21T03:11:12+05:30 IST