అంతర్వేది ఘటనాంతరం పోలీస్ శాఖ కీలక నిర్ణయం!

ABN , First Publish Date - 2020-09-13T14:25:00+05:30 IST

అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని తెలుగు రాష్ర్టాలకు చెందిన భక్తులు

అంతర్వేది ఘటనాంతరం పోలీస్ శాఖ కీలక నిర్ణయం!

అమరావతి : అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని తెలుగు రాష్ర్టాలకు చెందిన భక్తులు ఎంత ప్రీతిపాత్రంగా కొలుస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరీముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక మందికి ఆయన ఇంటి  దైవం. అయితే ఇంతటి ప్రసిద్ధి ఉన్న అంతర్వేదిలో రథం దగ్ధం కావడంతో ఒక్కసారిగా ఈ ఘటన పెను సంచలనమైంది. ఇప్పటికే ఈ ఘటనపై జగన్ సర్కార్‌ సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా  ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తమై కీలక నిర్ణయం తీసుకున్నారు.


కీలక నిర్ణయం ఇదే..

రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ఇతర ప్రార్థన మందిరాలకు జియో ట్యాగింగ్ చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్, సర్కిల్ ఆఫీస్, సబ్ డివిజన్, యూనిట్ రేంజ్ అధికారులతో ఇవాళ డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సలహాలు, సూచనలు చేయనున్నారు. అనంతరం ఇందుకు సంబంధించి మీడియా మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించనున్నారని సమాచారం. మొత్తానికి చూస్తే.. అంతర్వేది ఘటనతో పోలీసు శాఖ అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు.

Updated Date - 2020-09-13T14:25:00+05:30 IST