తిరుపతి: భారీవర్షాల కారణంగా జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలకు స్పెషల్ పార్టీ పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనవేస్తూ సహయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు ఆదేశించారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటికీ రావాలని సూచించారు.