వడ్డీ వ్యాపారులపై పోలీసుల ఉక్కుపాదం

ABN , First Publish Date - 2022-09-23T05:51:36+05:30 IST

అధిక వడ్డీలు వసూలు చేస్తూ అమా యకులను గురిచేసే వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్‌ సంస్థలపై ఉక్కుపాదం మోపుతామని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ హెచ్చరించారు.

వడ్డీ వ్యాపారులపై పోలీసుల ఉక్కుపాదం
వివరాలు వెల్లడిస్తున్న జగిత్యాల డీఎస్పీ ప్రకాష్‌


 జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు

జగిత్యాల టౌన్‌, సెప్టెంబరు 22: అధిక వడ్డీలు వసూలు చేస్తూ అమా యకులను గురిచేసే వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్‌ సంస్థలపై ఉక్కుపాదం మోపుతామని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ హెచ్చరించారు. జిల్లాలోని జగిత్యాల, జగిత్యాల రూరల్‌, కోరుట్ల, మెట్‌పల్లి, దర్మపురి పట్టణాల్లోని వడ్డీ వ్యాపారులు, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఫైనాన్స్‌లపై పోలీసులు గురువారం ఏకకాంలో దాడులు నిర్వహించారు. వారి వద్ద నాన్‌ జ్యుడిషి యల్‌ బాండ్‌ పేపర్లు, ప్రామిసరి నోట్లు, చెక్కులు, ద్విచక్రవాహనాల ఆర్‌సీ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సింధుశర్మ వివరించారు. జిల్లా వ్యా ప్తంగా నిర్వహించిన దాడుల్లో సుమారు కిలోన్నర బంగారం, రూ.32,11, 870 నగదు, 268 ప్రామిసరి నోట్లు, ఒక ప్రామిసరి నోట్‌ ఖాళీ బుక్‌, 10 బ్లాంక్‌ చెక్కులు, ఐదు రెసిడెన్షియల్‌ డాక్యుమెంట్లు, 34 ఆర్‌సీ కార్డులు స్వా ధీనం చేసుకున్నట్లు వివరించారు. జగిత్యాలలో నాలుగు, కోరుట్ల, ధర్మపురి లో ఆరు చొప్పున, మెట్‌పల్లిలో రెండు, జగిత్యాల రూరల్‌ సర్కిల్‌లో మూడు ఇళ్లల్లో సోదాలు చేసినట్లు పేర్కొన్నారు. 

అనుమతులు లేకుండా ఫైనాన్స్‌ నిర్వహించిన, అధిక వడ్డీలతో సామా న్యులను ఇబ్బందులకు గురి చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుం టామని ఎస్పీ సింధుశర్మ పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో జగిత్యాల, మెట్‌పల్లి డీఎస్పీ లు ప్రకాష్‌, రవీందర్‌ రెడ్డి, జగిత్యాల, జగిత్యాల రూరల్‌, కోరుట్ల, మెట్‌పల్లి, ధ ర్మపురి సీఐలు కిషోర్‌, కృష్ణ కుమార్‌, రాజశేఖర్‌ రాజు, శ్రీను, కోఠేశ్వర్‌తో పాటు జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-09-23T05:51:36+05:30 IST