ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ : బెదిరించిన యువకులకు కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2021-10-19T12:38:19+05:30 IST

‘‘అన్నంత పని చేస్తున్నారు’’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో సోమవారం ప్రచురితమైన,...

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ : బెదిరించిన యువకులకు కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌ సిటీ : ‘‘అన్నంత పని చేస్తున్నారు’’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో సోమవారం ప్రచురితమైన కథనానికి ఫలక్‌నుమా పోలీసులు స్పందించారు. యువకుడిని చంపుతామని కొందరు యువకులు ప్లాన్‌ చేస్తున్నారని ఓ యువకుడు బాధిత యువకుడి ఇంట్లో చెప్పాడు. దీంతో వారు  ఫిర్యాదు చేశారని ఫలక్‌నుమా అదనపు ఇన్‌స్పెక్టర్‌ రవి తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు అనుమానిత యువకులతో పాటు ఆ విషయాన్ని చేరవేసిన యువకుడిని రప్పించి విచారించామని చెప్పారు. కేవలం బాధుతుడిని ఆట పట్టించడానికే ఆ యువకుడు అలా చెప్పాడని ఏఐ తెలిపారు. యువకులకు కౌన్సెలింగ్‌తో ఇవ్వడంతో పాటు హెచ్చరించామని తెలిపారు.



Updated Date - 2021-10-19T12:38:19+05:30 IST