అల్లరి మూకలకు పోలీసుల కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2021-04-17T05:10:31+05:30 IST

ఆకతాయిలు, మహిళలను వేధించే అల్లరిమూకలకు జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో వారితల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

అల్లరి మూకలకు పోలీసుల కౌన్సెలింగ్‌
అల్లరి మూకలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న పోలీసులు

కడప(క్రైం), ఏప్రిల్‌ 16: ఆకతాయిలు, మహిళలను వేధించే అల్లరిమూకలకు జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో వారితల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. శుక్రవారం ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ మాట్లాడుతూ జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, ఎర్రగుంట్ల, వల్లూరు తదితర ప్రాంతాల్లో దాదాపు 200 మందికి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారని తెలిపారు. కేసుల్లో ఇరుక్కొని బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. బుద్ధిగా చదివి తల్లిదండ్రులకు పేరు తేవాలన్నారు. మరోసారి రోడ్లపై అనవసరంగా తిరిగితే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ ్చరించారు. అధిక జన సమ్మర్థ ప్రాంతాలు, షాపింగ్‌ ఏరియా ల్లో, కళాశాలలు, బస్సుస్టాండ్లలో మహిళా పోలీసులు మఫ్టీలో ఉంటారని అన్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల స్నేహాలపై, కదలికలపై నిఘా ఉంచాలన్నారు. పిల్లలు కాలేజీలకు వెళుతున్నారా, లేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా అని గమనిస్తూ ఉండాలన్నారు. 

చిన్నచౌకు పీఎస్‌ పరిధిలో...: చిన్నచౌకు పీఎస్‌ పరిధిలో శుక్రవారం రోడ్డుపై అనవసరంగా ద్విచక్ర వాహనాల్లో తిరుగుతున్న అల్లరి మూకలను దాదాపు 32 మందిని పోలీసులు పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి పెద్దల సమక్షంలో కౌన్సెలింగ్‌ చేశారు. కార్యక్రమంలో చిన్నచౌకు సీఐ, ఎస్‌ఐ-1, 2లు, పోలీసు సిబ్బంది ఉన్నారు.

లాడ్జీల్లో తనిఖీలు : చిన్నచౌకు ఎస్‌ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో నగరంలోని లాడ్జీల్లో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. ఎవరైనా కొత్తవారు దిగినప్పుడు వారి సమాచారం తప్పక రిజిష్టరులో నమోదు చేయాలని, లేదంటే చర్యలు తప్పవన్నారు.


Updated Date - 2021-04-17T05:10:31+05:30 IST