Abn logo
Sep 24 2021 @ 23:43PM

వీరన్నపేటలో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌

ప్రజలతో మాట్లాడుతున్న ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 24 : పోలీసులు ప్రజల ఆస్తి, ప్రాణ రక్షణకోసం నిరంతరం పని చేస్తుంటారని ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. శాంతిభద్రతలను కాపాడటమే లక్ష్యంగా పని చేస్తా రని చెప్పారు. శుక్రవారం రాత్రి వీరన్నపేటలో పో లీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. భారీ సంఖ్య లో పోలీసులు కాలనీ నలువైపులా ఇళ్లను తనిఖీ చేశారు. ఇళ్లలో నివాసం ఉంటున్న వారి ఆధార్‌ వి వరాలు, వాహనాల ధ్రువీకరణ పత్రాలను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలను ఉద్దేశిం చి మాట్లాడారు. ప్రజల భద్రతకోసమే పోలీసులు ఉన్నారన్న నమ్మకం కల్పించడం కోసమే ఇలాంటి తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. మీకు తెలియకుండా మీ కాలనీలలో సంఘవిద్రోహులు చేరి సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవ కాశం ఉంటుందని, ఇలాంటి ఆకస్మిక తనిఖీల వల్ల అలాంటి వారు ఆశ్రయం పొందితే వారిని అదుపు లోకి తీసుకుంటామన్నారు. ఈతనిఖీల వల్ల సామా న్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఎవరికైనా ఇళ్ళను అద్దెకిస్తే వారి పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాతనే ఇళ్ళను ఇవ్వాలని సూచిం చారు. గుర్తు తెలియని వారు, అనుమానాస్పదంగా కాలనీలలో తిరిగేవారి సమాచారం వెంటనే పోలీ సులకు తెలుపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.