ప్రేమ, వ్యామోహంపై కానిస్టేబుల్ అద్భుతమైన స్పీచ్

ABN , First Publish Date - 2021-07-10T21:37:51+05:30 IST

ప్రేమ, వ్యామోహంపై ఓ పోలీస్ కానిస్టేబుల్ చక్కగా సెలవిచ్చారు. బాల్య వివాహాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడిన ఆ కానిస్టేబుల్ తల్లిదండ్రుల బాధ్యతపై అద్భుతమైన ప్రసంగం చేశారు.

ప్రేమ, వ్యామోహంపై కానిస్టేబుల్ అద్భుతమైన స్పీచ్

ఇంటర్నెట్ డెస్క్(ఆంధ్రజ్యోతి): ప్రేమ, వ్యామోహంపై ఓ పోలీస్ కానిస్టేబుల్ చక్కగా సెలవిచ్చారు. బాల్య వివాహాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడిన ఆ కానిస్టేబుల్ తల్లిదండ్రుల బాధ్యతపై అద్భుతమైన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


‘‘ఏది ప్రేమ?.. ఏది ఆకర్షణ? అనే తేడాని ఆడపిల్లకు తల్లిదండ్రులే తెలియజెప్పాలి. అలా చెప్పకపోవడం వల్లే బాల్యవివాహాలు జరుగుతాయి. కావాలని ఎవరూ బాల్య వివాహాలు చేయాలని అనుకోరు. ప్రేమ పేరుతో పక్కదారి పడుతున్నప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అందువల్లే పిల్లలు పక్క దారి పట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనిస్తూ ప్రేమగా చూసుకోవాలి. మొబైల్ ఫోన్ల వల్ల కూడా పిల్లలపై చెడు ప్రభావం పడుతోంది. రామాయణం చూస్తున్నా మధ్యలో ఒకసారి బూతు బాగోతం వస్తుంది. దాన్ని నువ్వు చూడకుండా తప్పించు కోలేవు. నువ్వు వద్దన్నా అది చూపిస్తుంది. టీనేజ్ పిల్లలు దానికి ఆకర్షితులవుతారు. అందులో ఏముందో చూడాల్సిందేనంటూ చూసేందుకు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో ఇంట్లో అమ్మ నీతి మాటలు చెబితే తనను తిడుతోందనే ఫీలింగ్ వస్తుంది. అలాంటప్పుడు ఈ బాల్య వివాహాలు జరుగుతాయి. ఆడపిల్లను ఎవరైనా పొగిడారంటే ఆమె జీవితం నాశనం చేయడానికే. ఆడపిల్ల విషయంలో ఏ మగవాణ్నీ నమ్మడానికి లేదు. ఎల్లిగాడి చెల్లెల్ని మల్లిగాడు.. మల్లిగాడి చెల్లెల్ని ఎల్లిగాడు చెల్లిగా భావించిన రోజునే ఊరుమొత్తం బాగుంటుంది.’’ అంటూ ఆ వీడియోలో కానిస్టేబుల్ మాట్లాడారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారో వీడియోలో చూసేయండి.

Updated Date - 2021-07-10T21:37:51+05:30 IST