ముంబై పోర్న్ రాకెట్: రాజ్‌కుంద్రా, శిల్పాషెట్టి ఇంటిపై పోలీసు దాడులు

ABN , First Publish Date - 2021-07-24T00:05:48+05:30 IST

అశ్లీల ఫిల్మ్ రాకెట్ (పోర్న్ రాకేట్) కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు వేగం..

ముంబై పోర్న్ రాకెట్: రాజ్‌కుంద్రా, శిల్పాషెట్టి ఇంటిపై పోలీసు దాడులు

ముంబై: అశ్లీల ఫిల్మ్ రాకెట్ (పోర్న్ రాకేట్) కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను ఇప్పటికే అరెస్టు చేయగా, శుక్రవారంనాడు రాజ్‌కుంద్రా, ఆయన భార్య-బాలీవుడ్ నటి శిల్పాషెట్టి నివాసంలో సోదాలు జరిపారు. రాజ్‌కుంద్రా రిమాండ్‌ను పొడిగించాలని కోరుతూ ఉదయం ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు. రాజ్‌కుంద్రా  పోర్న్ రాకెట్ ద్వారా సంపాదించిన సొమ్మును ఆన్‌లైన్ బెట్టింగ్‌ కోసం వెచ్చించేవారని పోలీసులు తెలిపారు.


రాజ్‌కుంద్రా రిమాండ్ పొడిగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. ఈ వీడియోలను ఎంత మాత్రం ఫోర్నోగ్రఫీగా పరిగణించరాదంటూ రాజ్‌కుంద్రా తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. రాజ్‌కుంద్రా సైతం తన అరెస్టును హైకోర్టులో సవాలు చేసారు. తన అరెస్టులో చట్టబద్ధతను ప్రశ్నించారు. ఒరిజనల్ ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేదన్నారు. తన అరెస్టు తర్వాతే సీఆర్‌పీసీ41ఏ నోటీసుపై పోలీసులు తనతో సంతకం చేయించుకున్నారని అన్నారు. ఇది చట్ట ఉల్లంఘనేనని తన పిటిషన్‌లో రాజ్‌కుంద్రా హైకోర్టు దృష్టికి తెచ్చారు. 

Updated Date - 2021-07-24T00:05:48+05:30 IST