Abn logo
Sep 17 2020 @ 10:51AM

అల్లు అర్జున్‌పై పోలీస్ కంప్లైంట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై సమాచార హక్కు సాధనా స్రవంతి ప్రతినిధులు అదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్, `పుష్ప` చిత్ర యూనిట్ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి కుంటాల జలపాతాన్ని సందర్శించారని వారు పోలీసులకు తెలిపారు. 


ఇటీవల అల్లు అర్జున్ అదిలాబాద్ జిల్లాకు వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కుంటాల జలపాత సందర్శనను ప్రభుత్వం నిలిపేసినా.. అల్లు అర్జున్, `పుష్ప` టీమ్ సభ్యులు అక్కడకు వెళ్లారని, అనుమతులు లేకుండా తిప్పేశ్వర్‌లో షూటింగ్ చేశారని సమాచార హక్కు సాధనా స్రవంతి ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement