పోలీస్‌ క్లియరెన్స్‌ ఉంటేనే సౌదీ వర్క్‌ వీసా

ABN , First Publish Date - 2022-08-12T18:19:10+05:30 IST

సౌదీ అరేబియాలో పని చేయడానికి వెళ్లే భారతీయులు ఇక నుంచి పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ (పీసీసీ) సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు ముంబైలోని సౌదీ అరేబియా కాన్సులేట్‌ ట్రావెల్‌

పోలీస్‌ క్లియరెన్స్‌ ఉంటేనే సౌదీ వర్క్‌ వీసా

                            - ముంబైలోని సౌదీ కాన్సులేట్‌ నిర్ణయం


                       (ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి) 

సౌదీ అరేబియాలో పని చేయడానికి వెళ్లే భారతీయులు ఇక నుంచి పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ (పీసీసీ) సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు ముంబైలోని సౌదీ అరేబియా కాన్సులేట్‌ ట్రావెల్‌ ఏజెంట్లకు మార్గదర్శకాలు జారీచేసింది. వర్క్‌ వీసాకు దరఖాస్తు చేసుకునేవారి నుంచి పీసీసీలను తీసుకోవాలని సౌదీ కాన్సులేట్‌ పేర్కొన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆగస్టు 22వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. న్యూఢిల్లీలోని సౌబీ అరేబియా రాయబార కార్యాలయం ఇప్పటికే పీసీసీ నిబంధనను అమలుచేస్తోంది. ముంబై కాన్సులేట్‌ కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. pvc.tspolice.gov.in వెబ్‌సైట్‌ ద్వారా పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated Date - 2022-08-12T18:19:10+05:30 IST