బాలికపై సామూహిక అత్యాచారం.. ఫేస్‌బుక్ సహాయంతో నిందితులను పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..

ABN , First Publish Date - 2022-03-14T05:50:33+05:30 IST

ఆ బాలిక తన తల్లి తిట్టిందని ఇంట్లో నుంచి పారిపోయింది.. ఒంటరిగా బస్‌లో ప్రయాణిస్తుండగా.. నలుగురు యువకులు ఆమెను ట్రాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. 20 రోజుల అనంతరం ఆమె తన కుటుంబ సభ్యులకు కనిపించింది...

బాలికపై సామూహిక అత్యాచారం.. ఫేస్‌బుక్ సహాయంతో నిందితులను పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..

ఆ బాలిక తన తల్లి తిట్టిందని ఇంట్లో నుంచి పారిపోయింది.. ఒంటరిగా బస్‌లో ప్రయాణిస్తుండగా.. నలుగురు యువకులు ఆమెను ట్రాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. 20 రోజుల అనంతరం ఆమె తన కుటుంబ సభ్యులకు కనిపించింది. తను సామూహిక అత్యాచారానికి గురైనట్టు చెప్పింది. అయితే నిందితుల పేర్లు తప్ప మిగతా వివరాలేవీ చెప్పలేకపోయింది.. దీంతో పోలీసులు ఫేస్‌బుక్ సహాయంతో వారిని పట్టుకున్నారు. 


వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాకు చెందిన పదో తరగతి విద్యార్థిని తన తల్లి తిట్టిందని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఒంటరిగా షహరాన్ పూర్ జిల్లాకు చేరుకుంది. బస్సులో ఆ బాలికను ఒంటరిగా చూసిన ఖదీర్, ఇస్రాన్ అనే యువకులు ఆమెను మాటల్లోకి దించారు. ఆమెను తమ మెకానిక్ షెడ్డుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ మెకానిక్ షెడ్డులో ఉండే మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 20 రోజుల అనంతరం అదే ప్రాంతంలో ఉండే తమ బంధువుకు ఆ బాలిక కనిపించింది. అతడి సహాయంతో ఇంటికి చేరింది. 


అప్పటికే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన తల్లిదండ్రులు బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నిందితుల పేర్లు తప్ప పోలీసులకు ఆ బాలిక ఇంకేం చెప్పలేకపోయింది. దీంతో పోలీసులు ఫేస్‌బుక్‌లో ఖదీర్ అనే వ్యక్తి పేరుతో గాలించారు. ఆ పేరుతో చాలా ప్రొఫైల్స్ కనిపించాయి. అయితే ఒక ఐడీకి ఇస్రాన్ అనే వ్యక్తి కామెంట్ చేసినట్టు కనిపించింది. దీంతో బాధిత బాలిక పేరుతో పోలీసులు ఫేక్ ప్రొఫైల్ స‌ృష్టించి ఇస్రాన్‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. అతడు యాక్సెప్ట్ చేయగానే అతడితో మాటలు మొదలుపెట్టారు. అతడి అడ్రస్, ఫోన్ వివరాలు తెలుసుకున్నారు. అతడి ద్వారా మిగిలిన ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేశారు. 


Updated Date - 2022-03-14T05:50:33+05:30 IST