అంతా మర్చిపోయి ఉంటారులే అనుకున్నాడు.. 26 ఏళ్ల తర్వాత దర్జాగా సొంతూరికి వచ్చాడు.. కానీ..

ABN , First Publish Date - 2022-04-21T22:29:34+05:30 IST

అతను ఒక ట్రక్ డ్రైవర్.. గ్వాలియర్ నుంచి మధ్యప్రదేశ్‌లోని చిన్న పట్టణాలకు వస్తువులను సరఫరా చేస్తుండేవాడు..

అంతా మర్చిపోయి ఉంటారులే అనుకున్నాడు.. 26 ఏళ్ల తర్వాత దర్జాగా సొంతూరికి వచ్చాడు.. కానీ..

అతను ఒక ట్రక్ డ్రైవర్.. గ్వాలియర్ నుంచి మధ్యప్రదేశ్‌లోని చిన్న పట్టణాలకు వస్తువులను సరఫరా చేస్తుండేవాడు.. 26 ఏళ్ల క్రితం తన ట్రక్‌తో ఒక వ్యక్తిని ఢీకొట్టి చంపేశాడు.. ఆ తర్వాత తన స్వగ్రామం నుంచి పరారైపోయాడు.. పలు ప్రాంతాల్లో జీవనం సాగించాడు.. 26 ఏళ్ల తర్వాత 15 రోజుల క్రితం తన స్వగ్రామానికి చేరుకున్నాడు.. తన గురించి పోలీసులు మర్చిపోయి ఉంటారనుకున్నాడు.. అయితే అతను వచ్చినట్టు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. 


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు సమీపంలోని పలైచా గ్రామానికి చెందిన రామేశ్వర్ ట్రక్ డ్రైవర్‌గా పని చేసేవాడు. 26 ఏళ్ల క్రితం లోడ్ తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తూ గురుదేవ్ సింగ్ అనే వ్యక్తిని ఢీకొట్టి చంపేశాడు. గురుదేవ్ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. దీంతో పోలీసులు తనను అరెస్ట్ చేస్తారనే భయంతో రామేశ్వర్ గ్రామం నుంచి పరారయ్యాడు. ఢిల్లీతో పాటు ఫరీదాబాద్ మొదలైన ప్రాంతాల్లో జీవించాడు. రామేశ్వర్‌ను గ్వాలియర్ జిల్లా కోర్టు పరారీలో ఉన్న నేరస్థుడిగా పేర్కొంది. 


26 ఏళ్ల తర్వాత రామేశ్వర్ ఇటీవల తన స్వగ్రామానికి చేరుకున్నాడు. తన నేరాన్ని పోలీసులు మర్చిపోయి ఉంటారనుకున్నాడు. అయితే రామేశ్వర్ గ్రామానికి వచ్చిన విషయం ఓ ఇన్‌ఫార్మర్ ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. వెంటనే గ్రామానికి వెళ్లి అతడిని అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-04-21T22:29:34+05:30 IST