గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను క‌లుసుకునేందుకు లేడీ గెట‌ప్‌... తీరా దొరికిపోయాక‌...

ABN , First Publish Date - 2020-05-27T17:48:06+05:30 IST

గుజ‌రాత్‌లోని వల్సాడ్‌‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. లాక్‌డౌన్ కార‌ణంగా ఒక యువ‌కుడు త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను క‌లుసుకోలేని ప‌రిస్థితి ఏర్పడింది. దీంతో ఎలాగైనా ఆమెను క‌లుసుకోవాల‌ని...

గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను క‌లుసుకునేందుకు లేడీ గెట‌ప్‌... తీరా దొరికిపోయాక‌...

సూర‌త్‌: గుజ‌రాత్‌లోని వల్సాడ్‌‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. లాక్‌డౌన్ కార‌ణంగా ఒక యువ‌కుడు త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను క‌లుసుకోలేని ప‌రిస్థితి ఏర్పడింది. దీంతో ఎలాగైనా ఆమెను క‌లుసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. యువ‌తి వేషంలో ఆమెను క‌లుసుకునేందుకు బ‌య‌లుదేరాడు. ఇంత‌లో పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. పార్డీ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల‌ యువ‌కుడు యువ‌తి గెట‌ప్‌లో రోడ్డుమీద‌కు వెళితే పోలీసులు ప్ర‌శ్నించర‌ని భావించి, పంజాబీడ్రెస్ వేసుకుని ప్రేయ‌సిని క‌లుసుకునేందుకు బ‌య‌లు దేరాడు. అయితే రాత్రి పూట ఆడ‌వేషంలో వెళుతున్న ఆ యువ‌కుడిని చూసి పోలీసుల‌కు అనుమానం వ‌చ్చింది. దీంతో వారు ఎక్క‌డ‌కు వెళుతున్నార‌ని అడిగారు. పోలీసులు పదేపదే ప్ర‌శ్నించినా ఆ యువకుడు నోరు విప్పలేదు. నోరు విప్పితే పోలీసులు గుర్తిస్తారని అతను భయపడ్డాడు. దీంతోవారు అత‌ని ముఖంపై ఉన్న ముసుగు తొల‌గించి ఆశ్చ‌ర్య‌పోయారు. ఆడ వేషంలో వెళితే ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌ర‌ని భావించి ఇలా వెళుతున్నాన‌ని అత‌ను పోలీసుల‌కు తెలిపాడు. పోలీసుల విచార‌ణ‌లో ఆ యువకుడు మోతీవాడ్ ఫటక్ ప్రాంతానికి చెందినవాడ‌ని తెలిసింది. కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. 


Updated Date - 2020-05-27T17:48:06+05:30 IST