వ్యాపారస్తులతో మాట్లాడుతున్న టౌన్ ఇన్‌స్పెక్టర్ రవీందర్
కాగజ్‌నగర్ టౌన్, డిసెంబరు 5: ఒమైక్రాన్ వైరస్‌పై వస్తున్న నేప థ్యంలో ముందస్తుగా టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిబంధనలు పాటించాలని కోరుతూ ఆదివారం రాత్రి వ్యాపారులు, వ్యాపారసంస్థల్లో అవగాహన కల్పించారు. టౌన్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్, పొట్టి శ్రీరాములు చౌరస్తా, తీరందాజ్ ఏరి యాలో ఆయా దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారస్తులతో మాట్లాడారు. మాస్కులు ధరించని వారికి సరుకులు, వస్తువులు అమ్మరాదని అన్నారు. ప్రతీ ఒక్కరు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకొని సహకరించాలని వ్యాపారస్తులను సీఐ కోరారు.