అఖిలప్రియను 300 ప్రశ్నలు అడిగిన పోలీసులు

ABN , First Publish Date - 2021-01-14T00:18:24+05:30 IST

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మాజీమంత్రి అఖిలప్రియ మూడో రోజు కస్టడీ ముగిసింది. విచారణలో ఆమెను 300 పోలీసులు

అఖిలప్రియను 300 ప్రశ్నలు అడిగిన పోలీసులు

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మాజీమంత్రి అఖిలప్రియ మూడో రోజు కస్టడీ ముగిసింది. విచారణలో ఆమెను 300 పోలీసులు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అయితే చాలా ప్రశ్నలకు అఖిలప్రియ మౌనం పాటించినట్లు తెలుస్తోంది. మూడ్రోజుల విచారణలో కీలక విషయాలను పోలీసులు రాబట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అఖిలప్రియను బుధవారం ఉదయం బేగంపెట్ మహిళా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్, ఇద్దరు ఏసీపీల బృందం కలిసి కిడ్నాపర్లతో అఖిలప్రియ ఫోన్‌ సంభాషణ గురించి ప్రశ్నించగా.. తాను మాజీ మంత్రినని, ఎంతో మంది తనకు ఫోన్‌ చేస్తారని, ఆ క్రమంలోనే గుంటూరు శ్రీను మాట్లాడాడని చెప్పినట్లు సమాచారం.


పరారీలో ఉన్న గుంటూరు సీను, భార్గవ్‌రామ్ ఎక్కడ ఉన్నారనే దానిపై అఖిల ప్రియను ప్రశ్నించినట్లు పోలీసు వర్గాల సమాచారం. టవర్ లోకేషన్, సిమ్ కార్డ్ నంబర్స్, ఇతర ఆధారాలను అఖిలప్రియ ముందుంచి ప్రశ్నించారనే ప్రచారం జరుగుతోంది. గురువారం మధ్యాహ్నంతో అఖిల ప్రియ కస్టడీ ముగియనుంది. అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ను  ఈ కేసులు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలియవచ్చింది. ప్రవీణ్‌కుమార్‌, అతడి సోదరుల కిడ్నాప్‌లో సూత్రధారులు, పాత్రధారుల వివరాలను అతడి నుంచి రాబడుతున్నట్లు సమాచారం. ఈ కేసులో మొత్తం 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-01-14T00:18:24+05:30 IST