నేరాల నియంత్రణలో పోలీసుల చర్యలు భేష్‌

ABN , First Publish Date - 2021-06-22T04:56:39+05:30 IST

నేరాల నియంత్ర ణలో పోలీసుల చర్యలు భేష్‌గా ఉన్నాయని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మిఅన్నారు.

నేరాల నియంత్రణలో పోలీసుల చర్యలు భేష్‌
మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి

- జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూన్‌ 21: నేరాల నియంత్ర ణలో పోలీసుల చర్యలు భేష్‌గా ఉన్నాయని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మిఅన్నారు. ఆసిఇఫాబాద్‌ పట్ట ణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీపీ సత్య నారాయణ, ఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర, ఎమ్మెల్యే ఆత్రం సక్కులతో కలిసి ఆమె స్థానిక పోలీసుస్టేషన్‌ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ నేరాల నియంత్రణలో సాకేంతికతను వినియోగిం చుకోవడంతో నేరస్థులకు శిక్షపడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ పట్టణంలో పాత వాటితో కలిసి 109 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశా మన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, స్థానిక వ్యాపారస్థులకు కృతజ్ఞ తలు తెలిపారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లా డుతూ పోలీసులు ప్రజలకు సేవలు అందించడంలో ముందుకు రావడంసంతోషంగా ఉందన్నారు. మారు మూల గ్రామాలలో పోలీసుల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర మాట్లాడుతూ నేరపరిశోధనలో సీసీకెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్‌ యాదవ్‌రావు, ఎంపీపీ మల్లిఖార్జున్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గాదవేణి మల్లేష్‌, సీఐ అశోక్‌, ఎస్సైలు వెంకటేష్‌, రాజేశ్వర్‌, గంగన్న, వ్యాపారస్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T04:56:39+05:30 IST