పోలేరమ్మకు పొంగళ్లు

ABN , First Publish Date - 2021-02-24T02:53:19+05:30 IST

పట్టణంలోని శివాలయం వీధిలో కొలువై ఉన్న గ్రామ దేవత పోలేరమ్మకు చిట్టేపల్లి గ్రామస్థులు మంగళవారం భక్తిశ్రద్ధలతో పొంగళ్లు

పోలేరమ్మకు పొంగళ్లు
పొంగళ్ల తట్టలతో తరలివస్తున్న మహిళలు

పొదలకూరు, ఫిబ్రవరి 23 : పట్టణంలోని శివాలయం వీధిలో కొలువై ఉన్న గ్రామ దేవత పోలేరమ్మకు చిట్టేపల్లి గ్రామస్థులు మంగళవారం భక్తిశ్రద్ధలతో పొంగళ్లు సమర్పించారు. పొంగళ్లు తట్టలను తలలపై పెట్టుకొని చిట్టేపల్లి నుంచి మహిళలు అధిక సంఖ్యలో కాలి నడకన బాణసంచా కాలుస్తూ, మేళతాళాలతో అమ్మవారికి నైవేథ్యాలను తీసుకొచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు మధ్యాహ్నం అన్నదానం చేశారు. 


Updated Date - 2021-02-24T02:53:19+05:30 IST