Polavaram: పోలవరం ఎత్తు తగ్గిస్తేనే భద్రాద్రికి రక్షణ: తమ్మినేని వీరభద్రం

ABN , First Publish Date - 2022-07-18T23:44:56+05:30 IST

పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) ఎత్తు తగ్గిస్తే తప్ప భద్రాద్రికి రక్షణ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

Polavaram: పోలవరం ఎత్తు తగ్గిస్తేనే భద్రాద్రికి రక్షణ: తమ్మినేని వీరభద్రం

భద్రాచలం: పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) ఎత్తు తగ్గిస్తే తప్ప భద్రాద్రికి రక్షణ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) పేర్కొన్నారు. పోలవరంతో భద్రాద్రికి ముప్పు పొంచి ఉందని తమ పార్టీ తొలి నుంచి చెబుతోందన్నారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని దుయ్యబట్టారు. భద్రాచలం (Bhadrachalam)లో సోమవారం ఆయన గోదావరి వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు ఏపీపై ఒత్తిడి తేవాలన్నారు. ప్రతి వరద బాధిత కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.10వేల ఆర్థిక సాయం వరద బాధితులకు ఏమాత్రం సరిపోదన్నారు. ఏపీలో విలీనమైన ఆ ఐదు పంచాయతీలను తక్షణమే తెలంగాణలోకి తీసుకురావాలని, ఈ విషయంపై సీఎం కేసీఆర్‌ (CM KCR) ఇకనైనా దృష్టి సారించాలని తమ్మినేని హితవు పలికారు. 

Updated Date - 2022-07-18T23:44:56+05:30 IST