అమరావతి: పోలవరం నిర్వాసితులను పునరావాసం కల్పించాకే తరలించాలని జనసేనాని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జేసీబీలతో ఇళ్లను కూల్చి సదుపాయాలు నిలిపివేయడం దారుణమన్నారు. నిర్వాసితుల పట్ల ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరి బాధ కలిగిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులపై ప్రభుత్వ తీరు మానవ హక్కుల ఉల్లంఘనేనని ప్రకటించారు. ప్రభుత్వ వైఖరిని ఎన్‌హెచ్‌ఆర్సీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. నిర్వాసిత కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేవని పవన్‌కల్యాణ్ చెప్పారు.