పంటలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలి: ఎమ్మెల్యే బాలరాజు

ABN , First Publish Date - 2022-02-16T23:40:46+05:30 IST

పంటలను కాపాడడానికి తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని

పంటలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలి: ఎమ్మెల్యే బాలరాజు

బుట్టాయగూడెం (పశ్చిమ గోదావరి): పంటలను కాపాడడానికి తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని అధికారులను పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆదేశించారు. పంటలు చేతికొచ్చే సమయంలో త్రీ ఫేజ్ కరెంట్ కోతలను విధించడంపై ఎమ్మెల్యే దృష్టికి రైతులు తీసుకెళ్లారు. దీంతో రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సీఎండీతో ఎమ్మెల్యే మాట్లాడారు. మెట్ట ప్రాంతంలో పూర్తిగా బోర్ ఆధారిత వ్యవసాయం సాగవుతుందని ఆయన తెలిపారు. కరెంట్ సరిగా లేకపోవుట వలన పంటలు చివరి దశలో ఎండిపోతున్నాయన్నారు.


 లో వోల్టేజ్ సమస్యలు లేకుండా 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు. విద్యుత్ సమస్యను సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు. కరెంట్ సమస్యల వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ చేతికొచ్చిన పంట ఎండిపోకూడదని అధికారులను ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు స్పందించారు. లో వోల్టేజ్, త్రీ ఫేజ్ కరెంట్ సమస్యలను అధికారులు పరిష్కరిస్తున్నారు.


Updated Date - 2022-02-16T23:40:46+05:30 IST