Abn logo
Oct 17 2021 @ 12:41PM

జలకళ సంతరించుకున్న జల్లేరు జలాశయం

జంగారెడ్డిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం అలివేరు సమీపాన గల గుబ్బల మంగమ్మ తల్లి జల్లేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు జలాశయం కాలవ లాకు వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కాలవకు నీటిని విడుదల చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు జలాశయంలోకి భారీగా నీరు చేరి నిండు కుండను తలపిస్తోంది. సుమారు 5 వేల ఎకరాలకు నీటిని అందిస్తున్న జల్లేరు జలాశయం ఇక్కడి పంటపొలాలను సస్యశ్యామలం చేస్తూ ఏజెన్సీలోని ఆదివాసీ రైతాంగానికి వరప్రదాయనిగా పేరుగాంచింది.  తమ గ్రామాలకు జల సిరులను అందిస్తున్న ఈ జలకళపై అక్కడి గిరిజన ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండిImage Caption