వారి త్యాగఫలితమే నేటి స్వాతంత్ర్యం: ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

ABN , First Publish Date - 2022-08-16T01:09:24+05:30 IST

కొయ్యలగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు ఘనంగా..

వారి త్యాగఫలితమే నేటి స్వాతంత్ర్యం: ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): కొయ్యలగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడకల్లో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొని జెండాలు ఆవిష్కరించారు. కొయ్యలగూడెంలో 300 అడుగుల పొడవు జెండాతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పైలాన్‎ని ఆవిష్కరించారు. దేశ భక్తిని పెంపొందించేలా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకల్లో అలరించాయి. 


ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ ఆనాటి మహనీయుల త్యాగఫలితమే నేటి స్వాతంత్య్రం అని అన్నారు. వారు చేసిన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. వారి మార్గంలో ప్రతి ఒక్కరూ నడుస్తూ దేశ భక్తి, బాధ్యతతో కాపాడుకోవాలన్నారు.  


ఇక స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జడ్పీటీసీ దాసరి లక్ష్మీ, యంపీపీ గంజిమాల రామారావు, వైస్ యంపీపీ తుమ్మలపల్లి గంగరాజు, మట్టా వనజాక్షి, స్థానిక సర్పంచ్ ముప్పిడి విజయ కుమారి, వెస్ట్రన్ డెల్టా ఛైర్మెన్ గంజిమాల దేవి, గోడ్డాటి నాగేశ్వర రావు, సంకుకొండ, మట్టా సత్తి పండు, మంతెన సోమరాజు, షేక్ బాజీ, దాసరి విష్ణు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు జాతీయ జెండా పెట్టుకుని రిక్షా తొక్కుతూ ఆకట్టుకున్నారు.  


Updated Date - 2022-08-16T01:09:24+05:30 IST