‘పోలవరం’ అవినీతిపై సీబీఐ విచారణ జరగాలి

ABN , First Publish Date - 2022-08-10T06:22:26+05:30 IST

ఆదివాసీల మనుగడను దెబ్బతీస్తూ పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితుల పునరావాసం, భూ పరిహారాల పేరుతో జరిగిన కోట్లా ది రూపాయల అవినీతిపై సీబీఐ విచారణ జరగాలని ఆదివాసీ మహాసభ డి మాండ్‌ చేసింది.

‘పోలవరం’ అవినీతిపై సీబీఐ విచారణ జరగాలి

రంపచోడవరం, ఆగస్టు 9: ఆదివాసీల మనుగడను దెబ్బతీస్తూ పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితుల పునరావాసం, భూ పరిహారాల పేరుతో జరిగిన కోట్లా ది రూపాయల అవినీతిపై సీబీఐ విచారణ జరగాలని ఆదివాసీ మహాసభ డి మాండ్‌ చేసింది. రంపచోడవరంలో మంగళవారం ఆదివాసీ మహాసభ ఆధ్వ ర్యంలో జరిగినఆదివాసీ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు విచ్చేసి మాట్లాడారు. గిరిజన హక్కుల పరిరక్షణలో పాలకులు విఫలమయ్యారని, అధికారులు సైతం గిరిజనుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినారపు సూర్యనారాయణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో గిరిజన హక్కులన్నీ కొట్టుకుపోతున్నాయన్నారు. ఆలిండియా ట్రైబల్‌ మంచ్‌ ఇన్‌చార్జి సుందరరామరాజు, మానవ హక్కుల కేంద్రం కార్యదర్శి బాలు అక్కిస, న్యాయవాది ఏవీ సత్యనారాయణ దోపిడీ, భూ బదలాయింపులు తదితర అంశాలను వివరించారు. మన్యంలో తొలి తిరుగుబాటు నాయకుడు కారం తమ్మన్నదొర వారసురాలిని సత్కరించారు.  

Updated Date - 2022-08-10T06:22:26+05:30 IST