అమరావతి: పోలవరం (Polavaram) నిర్మాణంపై సీఎం జగన్ నోరుమెదపాలని మాజీమంత్రి దేవినేని ఉమా (Devineni Uma) డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్రెడ్డి మౌనం రాష్ట్ర రైతాంగానికి శాపంగా మారిందన్నారు. జోకర్ లాంటి జలవనరుల మంత్రితో పిచ్చిమాటలు చెప్పిస్తే సరిపోదన్నారు. తనను, టీడీపీ అధినేత చంద్రబాబును తిడితే పోలవరం పూర్తికాదని చెప్పారు. జగన్ (Jagan) మూర్ఖత్వం, అవగాహనారాహిత్యమే పోలవరానికి శాపంగా మారిందని దుయ్యబట్టారు. పోలవరంపై పొరుగురాష్ట్ర వ్యక్తి నిర్ణయాలు తీసుకోవడం.. జగన్ అసమర్థత కాదా? అని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ కేసుల భయంతో పోలవరాన్ని తాకట్టుపెడతారా?.. మూడేళ్లలో జగన్ ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేశారా? అని దేవినేని ఉమా ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి