Amaravathi : పోలవరాన్ని(Polavaram) నిర్లక్ష్యం చేస్తూ జాతికి ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ(Devineni Uma) పేర్కొన్నారు. పోలవరం డ్యామ్‌పై విచారణ జరిపిస్తే.. జగన్ రెడ్డి(Jagan Reddy) మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. అంబటి(Ambati) అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. పోలవరం పనులపై శ్వేతపత్రం విడుదల చేస్తారా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు. పోలవరం అంశంపై ఏ ప్రభుత్వం ఎంత చేసిందో తేల్చేందుకు.. చర్చకు తాము సిద్ధమని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో రికార్డు స్థాయిలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తామన్నారు. జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని దేవినేని ఉమ పేర్కొన్నారు.