పోలవరం జాప్యానికి కారణం చెప్పిన కేంద్రం

ABN , First Publish Date - 2022-07-19T21:57:55+05:30 IST

పోలవరం జాప్యానికి ఏపీ ప్రభుత్వ అసమర్ధతే కారణమని కేంద్రం పేర్కొంది. పోలవరంపై ఏపీ వైఖరిని తప్పు కేంద్రం పట్టింది.

పోలవరం జాప్యానికి కారణం చెప్పిన కేంద్రం

అమరావతి: పోలవరం జాప్యానికి ఏపీ ప్రభుత్వ అసమర్ధతే కారణమని కేంద్రం పేర్కొంది. పోలవరంపై ఏపీ వైఖరిని తప్పు కేంద్రం పట్టింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు జలశక్తి సహాయశాఖ మంత్రి బిశ్వేశ్వర్ లిఖిత పూర్వక సమాధానం చెప్పారు. పోలవరం గడువును మరోసారి కేంద్రం పొడిగించింది. 2024 జులై నాటికే పోలవరం పూర్తి సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తెలిపారు. వ్యూహాత్మక ప్రణాళికా లేకపోవడం వల్ల కూడా పోలవరం జాప్యం అవుతోందన్నారు. ఏపీకి పోలవరం ప్రాజెక్టు అమలు చేస్తున్న ఏజెన్సీతో సమన్వయ లోపం కూడా పోలవరం జాప్యానికి ప్రధాన కారణమేనని చెప్పారు. కరోనా కూడా పోలవరం జాప్యానికి మరో కారణంగా భావించారు. 

Updated Date - 2022-07-19T21:57:55+05:30 IST