TS News: కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఏం సాధించారు?: వైఎస్‌ షర్మిల

ABN , First Publish Date - 2022-07-25T22:43:29+05:30 IST

పక్క రాష్ట్ర సీఎంను ఇంటికి పిలిచి స్వీట్లు తినిపించినప్పుడు.. పోలవరం (Polavaram) వల్ల ఇబ్బంది అవుతుందని సీఎం కేసీఆర్

TS News: కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఏం సాధించారు?: వైఎస్‌ షర్మిల

హైదరాబాద్: పక్క రాష్ట్ర సీఎంను ఇంటికి పిలిచి స్వీట్లు తినిపించినప్పుడు.. పోలవరం (Polavaram) వల్ల ఇబ్బంది అవుతుందని సీఎం కేసీఆర్ (CM KCR) ఎందుకు అనలేదు? అని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) కట్టిన తర్వాతే వరద ఎక్కువ వచ్చిందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఏం సాధించారు? అని ప్రశ్నించారు. కాళేశ్వరం లోపాల బాధ్యత ఎవరు తీసుకుంటారని నిలదీశారు. కలర్ ఫోటోలకు, టూరిజం స్పాట్‌గా మాత్రమే కాళేశ్వరం పనికొచ్చిందని షర్మిల ఎద్దేవాచేశారు. కడెం ప్రాజెక్ట్ (Kadem project) గేట్లు మార్చాలన్న డిమాండ్లను సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు గేట్లు పనిచేయకపోవడం వల్లే ఇంత పెద్ద వరద వచ్చిందని తెలిపారు. 33 మంది సిబ్బంది ఉండాల్సిన కడెం ప్రాజెక్టు దగ్గర ముగ్గురే ఉన్నారని తెలిపారు. బాధితుల డిమాండ్ మేరకు కరకట్ట నిర్మించాలన్నారు. వరదల్లో గూడు కోల్పోయినవారికి డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టివ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.

Updated Date - 2022-07-25T22:43:29+05:30 IST