ప్రేమించకుంటే కుటుంబం మొత్తాన్ని లేపేస్తా..

ABN , First Publish Date - 2021-02-27T06:21:44+05:30 IST

ప్రేమించకుంటే కుటుంబం మొత్తాన్ని లేపేస్తా అంటూ పదో తరగతి విద్యార్థినిపై ఒక యువకుడు హెచ్చరించడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు.

ప్రేమించకుంటే కుటుంబం మొత్తాన్ని లేపేస్తా..


బాలికపై యువకుడి వేధింపులు జూఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు

భీమవరం క్రైం, ఫిబ్రవరి 26: ప్రేమించకుంటే కుటుంబం మొత్తాన్ని లేపేస్తా అంటూ పదో తరగతి విద్యార్థినిపై ఒక యువకుడు హెచ్చరించడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు. భీమవరం రూరల్‌ ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఒక గ్రామంలో పదో తరగతి బాలికను అదే గ్రామానికి చెందిన మణికంఠ అనే యువకుడు ప్రేమించమని కొంత కాలంగా వేధిస్తూ వెంటపడుతున్నాడు. బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. ఆ యువకుడు నేరుగా ఆమె ఇంటికి వెళ్లి మీ కుమార్తె తన ప్రేమను అంగీకరించకపోతే కుటుంబం మొత్తాన్ని చంపేస్తా అంటూ బెదిరించాడు. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కేసు నమోదు చేశారు. 


Updated Date - 2021-02-27T06:21:44+05:30 IST