రూ.500 కోట్లతో పోకర్ణ కొత్త యూనిట్‌

ABN , First Publish Date - 2021-07-31T06:32:16+05:30 IST

పోకర్ణ ఇంజనీర్డ్‌ స్టోన్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌ సమీపంలో రూ.500 కోట్లతో అత్యాధునిక క్వార్ట్జ్‌ సర్ఫేసెస్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది.

రూ.500 కోట్లతో పోకర్ణ కొత్త యూనిట్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పోకర్ణ ఇంజనీర్డ్‌ స్టోన్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌ సమీపంలో రూ.500 కోట్లతో అత్యాధునిక క్వార్ట్జ్‌ సర్ఫేసెస్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. లగ్జరీ క్వార్ట్జ్‌ సర్ఫేసె్‌సను ‘క్వాంట్రా క్వార్ట్జ్‌’ బ్రాండ్‌తో కంపెనీ విక్రయిస్తోంది. పోకర్ణ ఇంజనీర్డ్‌ స్టోన్‌ దేశంలోనే అతిపెద్ద ప్రీమియం క్వార్ట్జ్‌ సర్ఫేసెస్‌ తయారీ, ఎగుమతి కంపెనీగా ఉంది. పోకర్ణకు ఇది రెండో తయారీ యూనిట్‌. 2009లో ఆంధ్రప్రదేశ్‌లోని అచ్యుతాపురం ఏపీఎ్‌సఈజెడ్‌లో మొదటి ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పా టు చేసిన యూనిట్‌ 1,60,000 చదరపు మీటర్లు విస్తరించి ఉందని.. ఈ ప్లాంట్‌ ద్వారా నేరుగా 500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పోకర్ణ ఇంజనీర్డ్‌ స్టోన్‌ సీఎండీ గౌతమ్‌ చంద్‌ జైన్‌ తెలిపారు. పరోక్షంగా మరో 3,000 మందికి ఉపాధి లభిస్తుంది. శనివారం ఈ ప్లాంట్‌ను తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు ప్రారంభించనున్నారు. ఇటలీకి చెందిన బ్రెటాన్‌స్టోన్‌ టెక్నాలజీతో ఇక్కడ క్వార్ట్జ్‌ సర్ఫే్‌సలను తయారు చేయనున్నారు. కొత్త ప్లాంట్‌తో కంపెనీ సామర్థ్యం ఏడాదికి 1.5 కోట్ల చదరపు అడుగులకు పెరుగుతుంది. కొత్త ప్లాంట్‌ సామర్థ్యాన్ని పూర్తి స్థాయి లో వినియోగించుకుంటే ప్లాంట్‌ టర్నోవర్‌ ఏడాదికి దాదాపు రూ.400 కోట్లకు చేరుతుంది. 

Updated Date - 2021-07-31T06:32:16+05:30 IST