ట్రంప్‌కు పాయిజన్ పార్శిల్.. అనుమానిత మహిళ అరెస్ట్ !

ABN , First Publish Date - 2020-09-22T15:58:02+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై విషప్రయోగానికి యత్నించినట్లు అనుమానిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. కెనడా సరిహద్దుల నుంచి అమెరికాలోకి ప్రవేశించేందుకు యత్నిస్తుండగా ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు ఫెడరల్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తెలిపారు.

ట్రంప్‌కు పాయిజన్ పార్శిల్.. అనుమానిత మహిళ అరెస్ట్ !

కెనడా నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తుండగా అరెస్టు

న్యూయార్క్‌, సెప్టెంబరు 21: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై విషప్రయోగానికి యత్నించినట్లు అనుమానిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. కెనడా సరిహద్దుల నుంచి అమెరికాలోకి ప్రవేశించేందుకు యత్నిస్తుండగా ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు ఫెడరల్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తెలిపారు. ఆమె వద్ద నుంచి ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మహిళ అరెస్టు విషయాన్ని ఎఫ్‌బీఐ (ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) కూడా ధ్రువీకరించింది.


నిందితురాలి నుంచి ఇలాంటి ప్యాకేజీలే మరికొన్ని టెక్సాస్‌ నగరంలోని పలు చిరునామాలకు వెళ్లినట్లు గుర్తించిన అధికారులు.. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. శ్వేతసౌధం చిరునామాతో వచ్చిన విషపూరిత పార్శిల్‌ కెనడా నుంచి వచ్చినట్లు తొలుత పోలీసులు గుర్తించారు. ఆ దిశగా సాగిన దర్యాప్తులో ఈ మహిళే నిందితురాలని తేలింది. కానీ, ఈ మహిళ వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తులో కెనడా అధికారులు అమెరికాకు పూర్తిగా సహకరిస్తున్నారని కెనడా ప్రజారక్షణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మ్యారీ లిజ్‌ పవర్‌ తెలిపారు.


Updated Date - 2020-09-22T15:58:02+05:30 IST