Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోయి.. రా గౌరమ్మ

సూర్యాపేట, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : బతుకమ్మ వేడుకల్లో చివరిదైన సద్దుల బతుకమ్మను గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. గ్రామ, పట్టణ కూడళ్లు, చెరువుల వద్ద బతుకమ్మలను ఒక్కదగ్గరకు చేర్చి ఆడిపాడారు. పోయిరా బతుకమ్మ మళ్లీరా అంటూ నిమజ్జనం చేశారు. గౌరమ్మకు పూజ చేసి వాయినాలు ఇచ్చిపుచ్చు కున్నారు. జిల్లా కేంద్రమైన  సూర్యా పేటతో పాటు కోదాడ, హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల, తిరుమలగిరితో పాటు మం డల కేంద్రాల్లోనూ బతుకమ్మ పండ గను ఘనంగా నిర్వహించారు. సూర్యా పేటలో మంత్రి జగదీష్‌రెడ్డి, హుజూర్‌ నగర్‌ మండలం వేపలసింగారంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి, టీవీ నటి నవ్య స్వామి, తుంగతుర్తి మండలం తూర్పు గూడెంలో జడ్పీ చైర్‌పర్సన్‌ దీపిక బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. 

వేపలసింగారంలో 15 అడుగుల బతుకమ్మ


Advertisement
Advertisement