కావలసిన పదార్థాలు: మందం అటుకులు- అరకప్పు, రవ్వ- అరకప్పు, పెరుగు- కప్పు, ఉల్లి- ఒకటి, క్యాప్సికమ్- 1, క్యారెట్ తురుము- 1, కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు, అల్లం మిర్చి పేస్టు- అర స్పూను, ఉప్పు, నీళ్లు, నూనె- తగినంత, పోపు గింజలు- స్పూను
తయారుచేసే విధానం: అటుకుల్ని నీళ్లలో కడిగి పది నిమిషాలు పక్కన పెట్టాలి. అటుకులు, రవ్వ, నీళ్లు వేసి మిక్సీలో పిండిగా చేసుకోవాలి. దీంట్లో పెరుగు కలిపి పది నిమిషాలు నానబెట్టాలి. ఇందులో కూరగాయల ముక్కలు, కొత్తిమీర తరుగు, అల్లం మిర్చి పేస్టు, ఉప్పు వేసి బాగా కలపాలి. దీంట్లోనే పోపు కూడా వేసి ఇడ్లీల్లా ఉడికిస్తే సరి.