పోహా కట్‌లెట్స్‌

కావలసినవి: అటుకులు - ఒకకప్పు, బంగాళదుంపలు - రెండు, పసుపు - చిటికెడు, కారం - అర టీస్పూన్‌, గరంమసాలా - అర టీస్పూన్‌, మామిడికాయ పొడి - పావు టీస్పూన్‌, ఛాట్‌ మసాల - అర టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - అర టీస్పూన్‌, మిరియాల పొడి - పావు టీస్పూన్‌, కార్న్‌ఫ్లోర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, కొత్తిమీర - ఒక కట్ట, బ్రెడ్‌క్రంబ్స్‌ - ఒకకప్పు, మైదా - ఒక టేబుల్‌స్పూన్‌.


తయారీ విధానం: బంగాళదుంపలను ఉడికించి, మెత్తటి గుజ్జుగా చేసి పెట్టుకోవాలి. అటుకులను శుభ్రంగా కడిగి ఒక పాత్రలోకి తీసుకోవాలి. తరువాత అందులో బంగాళదుంపల గుజ్జు వేయాలి. తరువాత పసుపు, కారం, గరంమసాలా, మామిడికాయ పొడి, ఛాట్‌మసాలా, అల్లంవెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి, కార్న్‌ఫ్లోర్‌, కొత్తిమీర వేసి, తగినంత ఉప్పు వేసి మెత్తటి మిశ్రమంలా కలపాలి. మరొక పాత్రలో మైదా పిండి తీసుకుని అందులో కొద్దిగా కార్న్‌ఫ్లోర్‌ వేసి తగినన్ని నీళ్లు పోసి పలుచగా కలపాలి. చేతులకు నూనె రాసుకుని మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ వడల్లా ఒత్తుకుంటూ మైదా మిశ్రమంలో ముంచి, బ్రెడ్‌క్రంబ్స్‌ అద్దాలి. స్టవ్‌పై పాన్‌పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక వాటిని వేసి గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి. టొమాటో సాస్‌తో పోహా కట్‌లెట్స్‌ను వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

భాంగ్‌ పకోడిఓట్స్‌ ఇడ్లీఆపంమూంగ్‌ దాల్‌ ఛాట్‌రైస్‌ బాల్స్‌భేన్‌ కి కబాబ్‌ సాబుదానా కబాబ్‌దహీ కబాబ్‌క్యాబేజీ పకోడివిటమిన్‌ ఇడ్లీ
Advertisement
Advertisement