పొగాకు పరిమిత సాగు.. రైతుల బాగు

ABN , First Publish Date - 2022-06-16T03:28:47+05:30 IST

కలిగిరి పొగాకు వేలం కేంద్రలో కొనుగోళ్లు ఈ నెల ఆరోతేదీతో ముగిశాయి. వాతావరణ పరిస్థితులు ఈ ఏడాది పంటసాగుకు

పొగాకు పరిమిత సాగు.. రైతుల బాగు
కలిగిరి వేలం కేద్రంలో పొగాకు కొనుగోళ్లు

కష్టాల నుంచి గట్టెక్కిన సాగుదారులు

ముగిసిన కొనుగోళ్లు

కలిగిరి, జూన్‌ 15: కలిగిరి పొగాకు వేలం కేంద్రలో  కొనుగోళ్లు ఈ నెల ఆరోతేదీతో ముగిశాయి. వాతావరణ పరిస్థితులు ఈ ఏడాది పంటసాగుకు అనుకూలించాయి. పొగాకు దిగుబడులు, కొనుగోళ్లను పరిశీలిస్తే  ఈ ఏడాది నమోదైన ధరలు రైతులను నష్టాల ఊబి నుంచి  గట్టెక్కిం చాయని తెలుస్తోంది. ప్రతి ఏటా వ్యయప్రయాసలకొనర్చి రైతన్న పొగాకు పండిస్తే, పంట దిగుబడుల నమోదుపై ధరల ప్రభావం ఉండేది. దీని ప్రకారం రైతుల వద్ద ఉన్న పొగాకును బట్టికంపెనీలు సిండికేట్‌ అయి ధరలను నియంత్రించడం, అనుమతులు లేవంటూ రకరకాల కారణాలతో కొనుగోళ్లు జరిపే విధానాన్ని మార్చడం చేస్తుండేవి.


 తగ్గిన సాగు విస్తీర్ణం


 ఈ ఏడాది కలిగిరి వేలం కేద్రం పరిధిలో 3240 హెక్టార్ల  సాగుకు పొగాకు సాగుకు బోర్డు అనుమతులు మంజూరు చేయగా, రైతులు కేవలం 2237 హెక్టార్లలోనే సాగు చేశారు.  వాతావరణం అనుకూలించడం, నాణ్యతా ప్రమాణాలతో పొగాకు దిగుబడులు రావడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ ఏడాది పొగాకు ఉతత్తులకు డిమాండ్‌ ఉడటంతో విక్రయాల ప్రారంభం నుంచి రైతులకు సగటు ధర 165 తగ్గకుండా లభించడంతో అన్ని రకాల గ్రేడింగ్‌ పొగాకుకు పూర్తిస్థాయిలో మద్దతు ధర అందింది.


 తీరిన కష్టాలు


 గత పదేళ్లుగా తీవ్ర నష్టాలు చవిచూస్తున్న పొగాకు రైతులకు కాలం కలిసి వచ్చింది. ఈ ఏడాది కొనుగోళ్లు అనుకూలంగా ఉండటంతో సాగుచేసిన ప్రతి రైతు ఆర్ధికంగా  నిలదొక్కుకోవడం జరిగిందనే చెప్పాలి. అయితే ఇదే అదునుగా రానున్న పంటకాలానికి ఇప్పటి నుంచే పొగాకు బ్యారన్‌లకు, కౌలు పొలాలకు డిమాండ్‌ పెరిగినట్లు రైతులు పేర్కొంటున్నారు. 



పరిమిత సాగుతోనే లబ్ధి


 రైతులు ఈ ఏడాది తక్కువ విస్తీర్ణంలో పొగాకు సాగు చేశారు. దీంతో వారికి గిట్టుబాటు ధరలు లభించాయి. ప్రతి ఏటా బోర్డు సూచించిన మేరకే రైతులు సాగు చేయాలి.

- సత్యశ్రీనివాస్‌, వేలం నిర్వహణాధికారి




Updated Date - 2022-06-16T03:28:47+05:30 IST