జన్నేపల్లి శివాలయంలో కవిత పూజలు

ABN , First Publish Date - 2021-03-02T08:43:11+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా జన్నేపల్లి పురాతన శివాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జన్నేపల్లి శివాలయంలో కవిత పూజలు

హైదరాబాద్‌ నుంచి వాహనాలతో ర్యాలీ

గజమాలతో సన్మానించిన పార్టీ శ్రేణులు

నిజామాబాద్‌ / నవీపేట మార్చి 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : నిజామాబాద్‌ జిల్లా జన్నేపల్లి పురాతన శివాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు అత్తగారి ఊరు అయిన జన్నేపల్లిలోని ఈ శివాలయాన్ని ఇటీవల ఆయన పునర్నిర్మించారు. మైనంపల్లి ఆహ్వానం మేరకు ఎమ్మెల్సీ కవిత సోమవారం ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పురాతన శివాలయం ఉన్న జన్నేపల్లి.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని, మండల కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. పురాతన శివాలయానికి హన్మంత్‌రావు పూర్వ వైభవం తేవడం విశేషమని కొనియాడారు. కాగా, హైదరాబాద్‌ నుంచి జన్నేపల్లికి బయలుదేరిన కవితకు టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మాధవనగర్‌ వద్ద కవితకు క్రేన్‌ ద్వారా గజమాల వేశారు. 

Updated Date - 2021-03-02T08:43:11+05:30 IST