పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతున్న నరాల రామారెడ్డి
పుస్తకావిష్కరణ సభలో -వక్తలు
ప్రొద్దుటూరు అర్బన్ జనవరి 16 : గ్రామీణ సమాజంలోని మానవసంబంధాల వైవిధ్యాన్ని కవిత్వంగా మలిచిన కవి దస్తగిరి అని, సామాజిక జీవితాన్ని ప్రతిబింబించేలా చద్దికూడు కవితాసంకలనాన్ని వెలువరించడ ం అభినందనీయమని ప్రముఖ కవి నరాల రామారెడ్డి పేర్కొన్నారు.ఆదివారం స్థానిక కొర్రపాడురోడ్డులోని శివచంద్రారెడ్డి ఆయిల్‌మిల్లులో కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్యర్యంలో చద్దికూడు కవితాసంకలనాన్ని పట్టణ రచయితలు ఆవిష్కరించారు. ఈ ఈకార్యక్రమంలో కవి ఎన్‌ఎస్ ఖలందర్, రచయిత్రి వరలక్ష్మి, ఉపాధ్యాయ సంఘాల గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, సాధుగోపాల క్రిష్ణ మూలే రామమునిరెడ్డి, సాహిత్య అభిమానులు పాల్గొన్నారు.