కలెక్టరేట్‌లో జూన్‌ 2న కవి సమ్మేళనం

ABN , First Publish Date - 2022-05-24T05:07:40+05:30 IST

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్‌ 2న కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ పేర్కొన్నారు.

కలెక్టరేట్‌లో జూన్‌ 2న కవి సమ్మేళనం


















మెదక్‌, మే 23: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్‌ 2న కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ పేర్కొన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఈ మేరకు జూన్‌ 2న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, రాసస్త్యం, తెలంగాణ కళలు, ప్రజల జీవన విధానం తదితర అంశాలపై కవి సమ్మేళనం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల కవులు, ఔత్సాహికులు ఈ నెల 28న సాయంత్రం 5 గంటల్లోగా కవి సమ్మేళనం సమన్వయ అధికారి రాజిరెడ్డి 8328599157 వాట్సాప్‌ నంబర్‌కు తమ పేరు, చిరునామ, వృత్తి, మొబైల్‌ నెంబర్‌, వివరాలను పంపి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. 

Updated Date - 2022-05-24T05:07:40+05:30 IST