పోడు భూములకు పట్టాలివ్వాలి

ABN , First Publish Date - 2020-08-10T11:10:38+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు అన్యాయం చేస్తున్నాయని ఏపీ గిరి జన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పోలోజు నాగేశ్వరరావు, ..

పోడు భూములకు పట్టాలివ్వాలి

ఆదివాసీ దినోత్సవ సభల్లో వక్తలు


పోలవరం/ కుక్కునూరు/ వేలేరుపాడు/ చింతలపూడి/ తాడేపల్లిగూడెం రూరల్‌/ జీలుగుమిల్లి, ఆగస్టు 9 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు అన్యాయం చేస్తున్నాయని ఏపీ గిరి జన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పోలోజు నాగేశ్వరరావు, గొరగం భూచంద్రం అన్నారు. పోలవరం మండలం ఇటుకల కోట, వింజరం పంచాయతీల్లో ఏపీ గిరిజన సంఘం జెండా ఆవిష్కరించారు. ప్రతీ గిరిజనుడి పోడు భూమికి పట్టాలివ్వాలని, ఏజెన్సీలోని గిరిజన యువతి, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆదివాసీ దినోత్సవ సభలో ప్రాజెక్టు డైరెక్టర్‌ గంగు అనీల్‌ కుమార్‌ మాట్లాడుతూ ఆదివాసీలు అభివృద్ధి పథంలో పయనించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆకుల సత్య నారాయణ, మాజీ సర్పంచ్‌ సున్నం గంగా జలం, బీజేపీ జిల్లా ఉపాధ్యాక్షురాలు గొరగం వెంకటలక్ష్మి, మూల్యం గంగరాజు, సిలోమెన్‌, వీవీ వెంకటగిరి పాల్గొ న్నారు. కుక్కునూరు మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్‌, ఆది వాసీ టీచర్స్‌ అసోసియేషన్‌, ఆదివాసీ ఉద్యోగులు, విద్యార్థి సంక్షేమ పరిషత్‌ ఆధ్వ ర్యంలో ఆదివాసీ జెండా ఎగుర వేశారు.


వేలేరుపాడు మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో ఆదివాసీ జెండాలను ఎగుర వేశారు. చింతల పూడి మండ లంలోని నామవరంలో జిల్లా లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు కీమ్యా నాయక్‌ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఆదివాసీల హక్కుల కోసం తమ పోరాటం నిరంతరం సాగుతుందని ఏపీ ఎస్సీ గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సింగం సుబ్బారావు పేర్కొన్నారు.ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం మండలం మెట్టఉప్పరగూడెం, మాధ వరం గ్రామాల్లో ఆదివారం ఏకలవ్యుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. జిల్లా ఆదివాసీ ఐక్య కార్యచరణ కమిటీ చైౖర్మన్‌ మొడియం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జీలుగుమిల్లి మండలం చంద్రమ్మకాలనీ, పండువారి గూడెం గ్రామాల్లో ఆదివాసీ దినోత్సవాలు జరిగాయి.

Updated Date - 2020-08-10T11:10:38+05:30 IST