పోడు భూమి వివాదం.. కోర్లగుట్టలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-05-22T00:57:43+05:30 IST

ఇల్లందు మండలం సుభాష్‎నగర్‎లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక కోర్లగుట్ట సమీపంలో పోడు భూములకు...

పోడు భూమి వివాదం.. కోర్లగుట్టలో ఉద్రిక్తత

భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు మండలం సుభాష్‎నగర్‎లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.  స్థానిక కోర్లగుట్ట సమీపంలో పోడు భూములకు ట్రెంచ్ కొట్టడానికి ఫారెస్ట్ అధికారులు (Forest Officers) ప్రయత్నించారు. దీంతో రైతులు అడ్డుకున్నారు. ఫారెస్ట్ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఫారెస్ట్ అధికారుల చర్యలు నిరసిస్తూ రైతులు (Formers) ఆందోళనకు దిగారు. పోడు భూములను స్వాధీనం చేసుకోవడాన్ని విరమించుకోవాలని ధర్నా నిర్వహించారు.  కోర్లగుట్ట (Korlagutta) సమీపంలో 17 మంది రైతులు గత కొన్ని ఏళ్లుగా కోడు భూములను సాగు చేసుకుంటున్నారు. సుమారు నలభై రెండు ఎకరాల భూమి సాగుబడిలో ఉంది. ఈ భూమిని సంవత్సరకాలంగా అటవీశాఖ స్వాధీనం చేసుకొని అక్కడ మెగా పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అందులో భాగంగా కోర్లగుంట సమీపంలోని పోడు భూములకు ట్రెంచ్ చేసేందుకు అధికారులు, సిబ్బంది ప్రయత్నించారు. దీంతో పోడు రైతులు అడ్డుకున్నారు. తమ భూమి జోలికి వస్తే ఊరుకోనేది లేదని, చావనైనా చస్తామని, భూమిని మాత్రం వదిలేదిలేదని రైతులు అంటున్నారు.




Updated Date - 2022-05-22T00:57:43+05:30 IST