కుక్క రోడ్డు దాటుతుండగా.. బైకును తప్పించబోయి అదుపు తప్పి..

ABN , First Publish Date - 2020-08-09T16:04:19+05:30 IST

కుక్క రోడ్డు దాటుతుండగా బైకును తప్పించబోయి అదుపు తప్పి..

కుక్క రోడ్డు దాటుతుండగా.. బైకును తప్పించబోయి అదుపు తప్పి..

పీసీపల్లి(ప్రకాశం): కుక్క రోడ్డు దాటుతుండగా బైకును తప్పించబోయి అదుపు తప్పి వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం రాత్రి చల్లగిరగల బైపాస్‌ వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే స్థానికుల కథనం ప్రకారం.. షేక్‌ ఖాజావలి పొదిలి నుంచి కనిగిరికి వస్తుండగా మార్గ మధ్యంలో చల్లగి రగల వద్ద కుక్క రోడ్డుకు అడ్డంగా వచ్చింది. దీంతో బజాజ్‌ డిస్కవరీ మోటారు బైక్‌పై వస్తున్న ఖాజావలి కుక్కను తప్పించే క్రమంలో బైకు అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. తలకు తీవ్ర గాయమైంది. చల్లగిరగల వాసులు 108కు ఫోన్‌ చేయగా వారు కనిగిరికి చెందిన 108 వాహనం అందు బాటులో లేదని సమాధానం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు కూడా స్పందించలేదని తెలిపారు. అరగంట పాటు 108 కోసం ఎదురు చూస్తూ క్షతగాత్రుడు ప్రాణాలు పోయే స్థితిలో కొట్టుమిట్టాడు. 


Updated Date - 2020-08-09T16:04:19+05:30 IST