Abn logo
Nov 24 2020 @ 20:52PM

ట్రిపుల్ రియర్ కెమెరాతో వచ్చేసిన ‘పోకో ఎం3’

న్యూఢిల్లీ: షియోమీ సబ్ బ్రాండ్ షియోమీ ఎం సిరీస్‌లో మరో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ‘పోకో ఎం3’ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 662 చిప్‌సెట్, ట్రిపుల్ రియర్ కెమెరా వంటివి ఉన్నాయి. పోకో ఎం3 4జీబీ+64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర భారత్‌లో దాదాపు రూ. 11 వేలు ఉండే అవకాశం ఉంది. అలాగే, రూ. 4జీబీ+128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 12,500 ఉండే అవకాశం ఉంది. ఈ నెల 27 నుంచి విక్రయానికి రానుంది. అయితే, ఇండియాలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అయ్యేదీ వివరాలు తెలియరాలేదు. 

పోకో ఎం3 స్పెసిఫికేషన్లు: డ్యూయల్ సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 662 ఎస్ఓసీ, 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, 8 ఎంపీ ఫ్రంట్ షూటర్, 4జీబీ ర్యామ్, 64, 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ వేరియంట్లు, 512 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటివి ఉన్న ఈ ఫోన్ బరువు 198 గ్రాములు మాత్రమే.  

Advertisement
Advertisement
Advertisement